ePaper
Thursday, April 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడఅంబేద్కర్ జయంతోత్సవాలకు ఏర్పాట్లు వేగవంతం

అంబేద్కర్ జయంతోత్సవాలకు ఏర్పాట్లు వేగవంతం

రామచంద్రపురం, పెన్ పవర్, ఏప్రిల్ 8: ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.రామచంద్రపురం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దడాల నాగేశ్వరినాగార్జున ఆధ్వర్యంలో ద్రాక్షారామం మార్కెట్ యార్డులో ఏప్రిల్ 14న నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి బుధవారం సమీక్ష సమావేశం జరిగింది.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరగబోయే జయంతోత్సవ కార్యక్రమాల నిర్వహణకు రూట్ మ్యాప్ రూపొందించేందుకు కే గంగవరం, రామచంద్రపురం రూరల్, రామచంద్రపురం పట్టణం, కాజులూరు మండలాల పరిధిలోని దళిత నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సుమారు 70 మంది దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ సూచనలు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular