ePaper
Saturday, May 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్చిలకలూరిపేటలో కారు బీభత్సం

చిలకలూరిపేటలో కారు బీభత్సం

📰 Generate e-Paper Clip

ఈగల్ బిర్యానీ రెస్టారెంట్ వద్ద టిఫన్ హోటల్ ధ్వంసం

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 09 :  

చిలకలూరిపేట: పట్టణంలో మద్యం మత్తులో యువత సృష్టించిన బీభత్సం కలకలం రేపింది. స్థానిక ఈగల్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంట్ వద్దకు అతివేగంగా దూసుకొచ్చిన ఒక కారు, హోటల్ బోర్డును బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నట్లు సమాచారం.నియంత్రణ కోల్పోయిన కారు ఒక్కసారిగా హోటల్ పైకి దూసుకెళ్లడంతో ఈగల్ బిర్యానీ రెస్టారెంట్‌తో పాటు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ సామాగ్రి పూర్తిగా ధ్వంసమై నేలమట్టమయ్యాయి. టిఫిన్ హోటల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది.

పోలీసుల రంగప్రవేశం

సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న వారు తీవ్రమైన మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం రోడ్డుపై పడి ఉన్న బోర్డును, ప్రమాదానికి గురైన కారును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular