ePaper
Friday, April 10, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఅడ్డతీగలలో సౌర విద్యుత్ యోజనకు శ్రీకారం. మండలంలో సోలార్ వెలుగులు...

అడ్డతీగలలో సౌర విద్యుత్ యోజనకు శ్రీకారం. మండలంలో సోలార్ వెలుగులు…

అడ్డతీగల, పెన్ పవర్,ఏప్రిల్ 09: అడ్డతీగల మండలంలో పీఎం సూర్యఘర్ యోజన కింద తొలి సోలార్ రూఫ్‌టాప్ యూనిట్‌ను ఎమ్మెల్యే మిరియాల. శిరీష దేవి ప్రారంభించారు. సినిమా హాల్ కాలనీలో వేమగిరి .అర్జున్ నివాసంపై ఏర్పాటు చేసిన యూనిట్‌ను ఎమ్మెల్యే శిరీష దేవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో మొదటి విడతలో 538 సర్వీసులు ఏర్పాటు చేసి సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సాధించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు నెలకు రూ.200 చొప్పున సబ్సిడీ నేరుగా ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఈ. స్వప్న కుమారి, టిడిపి మండల అధ్యక్షుడు రమణారెడ్డి, బీర. బాలయోగి, గొర్లె. సాగర్, కూటమి నాయకులు ,కార్యకర్తలు ఎలక్ట్రికల్ ఈ.ఈ బి.వి రమణ, రంపచోడవరం రూరల్ ఏ.డి గోపాలకృష్ణ, అడ్డతీగల ఎలక్ట్రికల్ ఏఈ సుదర్శన్, అడ్డతీగల టౌన్ లైన్మెన్ సుబ్రమణ్యం, హెల్పర్ లోవరాజు ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular