ఒకరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు
రంపచోడవరం: పెన్ పవర్ నవంబర్ 20
రంపచోడవరం పట్టణ శివారులో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ ఆర్టీసీ బస్టాప్ సమీపంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
రంపచోడవరం సీఐ నరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మారేడుమిల్లి వైపు నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద 30 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ తనిఖీల్లో ఎస్సై రమేష్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

