ePaper
Saturday, April 11, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంఅధికారుల అలసత్వం సహించను – ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

అధికారుల అలసత్వం సహించను – ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

గంగవరం /గుర్తేడు, పెన్ పవర్, ఏప్రిల్ 10: ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం చూపకూడదని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పష్టం చేశారు. గుర్తేడు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆమె మండల పార్టీ అధ్యక్షుడు పొత్తూరి కాంతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆయా గ్రామాల్లో ఆమెకు గ్రామస్తులు, కూటమి శ్రేణులు ఆదివాసీ సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఆమె ప్రజల నుండి అందిన ప్రతి దరఖాస్తును పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. దరఖాస్తుదారులు ఆధార్, మొబైల్ నంబర్లతో వినతులు సమర్పించాలని సూచించారు. సమస్యల పరిష్కార గడువును సంబంధిత అధికారులు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

మారుమూల గ్రామాల అభివృద్ధి లక్ష్యం

గుర్తేడు మండలం తుమ్మిచేలు గ్రామంలో ఆమె స్వంత నిధులతో నిర్మించిన గ్రావిటీ వాటర్ పైప్‌లైన్‌ను ప్రారంభించారు. త్రాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యకర్తల సంక్షేమమే ప్రధాన్యం

వట్టిగెడ్డ గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఒక సైనికుడని పేర్కొన్నారు. కార్యకర్తల కష్టాలు తనకు తెలుసని, అందరికీ సముచిత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. రానున్న సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బాధితులకు పరామర్శ, ఆర్థిక సాయం

పర్యటనలో భాగంగా గొరకునూరు, వట్టిగెడ్డ, కొత్తవూరు గ్రామాల్లో పర్యటించిన ఆమె వడగళ్ల వానతో ఇల్లు దెబ్బతిన్న కిలో గంగాయి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అలాగే మరణించిన తెదేపా సీనియర్ నాయకుడు పాంగి మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

ఇర్లవాడ ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులకు అందుతున్న విద్యా విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు గుణాత్మక విద్య అందించాలని సూచించారు. ప్రభుత్వ రాయితీల్లో ఎలాంటి రాజీ పడకూడదని హెచ్చరించారు.ఈ
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరి కాంతరెడ్డి, మాజీ ఎంపీపీ గొర్లె శ్రీకాంత్, మాజీ సర్పంచ్ గొర్లె దుస్యంతుడు, జనసేన మండల పార్టీ అధ్యక్షులు పుష్ప రాజు, గుర్తేడు జనసేన మండల అధ్యక్షులు గొర్లె చిరంజీవి, గుర్తేడు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కొండ్ల విజయ్ కుమార్ రెడ్డి, టీడీపీ యూనిట్ ఇంచార్జి కొండ్ల శివ శంకర్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మరిగెల బంతి రాజు, బూత్ ఇంచార్జి పసుపులేటి రాంబాబు, జర్తా రాంబాబు, కడబాల గోపి, కొర్రా రామ్మూర్తి, కడబాల దేవిరెడ్డి , తహసిల్దార్ వేణుగోపాల రావు , మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె.బాపన్నదొర, వెలుగు ఏపి జారగెడ్డ ఆదినారాయణ, వ్యవసాయ శాఖ అధికారిణి ఉషా, ప్రధానోపాధ్యాయులు పి. విజయలక్ష్మి దేవి, డిప్యూటీ హెచ్ ఎం ఎం .చిన్ని బాబు, డిప్యూటీ వార్డెన్ కె .నాగలక్ష్మి, ఏ టి డబ్ల్యూ ఓ జల్లి శంభుడు , పలు ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular