ePaper
Friday, April 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుభారత రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

భారత రాజ్యాంగానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర.

ముంచంగిపుట్టు, పెన్ పవర్, ఏప్రిల్ 14.భారత రాజ్యాంగానికి బదులు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ చర్లపల్లి సుభద్ర అన్నారు. అల్లూరి జిల్లా, ముంచంగిపుట్టు మండల కేంద్రంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ.. భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించుటలో అణగారిన వర్గాలకు దృష్టిలో పెట్టుకొని అందరికీ రాజ్యంగంలో సమాన హక్కులు కల్పించారన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుందని, గిరిజన ప్రాంతంలో గిరిజనుల పరిస్థితి అధ్వానంగా మారాయి అన్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలుతుందని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు తప్ప, భారత రాజ్యాంగాన్ని అమలు కావట్లేదు అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందని ఆమె మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలులో భాగంగా భారత రాజ్యాంగ నిర్మత అంబేద్కర్ త్యాగాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో శాంతి పాలన అందించమని చైర్ పర్సన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు మూర్తి, పద్మారావు, రమేష్, బాబురావు, కమల, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular