గూడెం కొత్త వీధి/చింతపల్లి,పెన్ పవర్,ఏప్రిల్ 16: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన పాడేరు శ్రీ శ్రీ మోదకొండమ్మ జాతర విషయంలో కూటమి నాయకులు రాజకీయాలు చేయడం తగదని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. అమ్మవారితో ఆటలాడొద్దని హెచ్చరించారు.గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పాడేరు ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ చైర్మన్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు కలిసి జాతర తేదీలను మే 10, 11, 12గా నిర్ణయించారని తెలిపారు. అయితే గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి జాతరను మే 17, 18, 19 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించడం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించారు.తల్లి పుట్టినరోజు, ముహూర్తం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించిన తేదీలను కమిటీకి తెలియకుండా మార్చడం సరికాదన్నారు. ఇది అఖిలపక్ష నిర్ణయమని, ఈ విషయంపై సంబంధిత నాయకులకు కూడా పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. కావాలనే తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పలు ఆధ్యాత్మిక అంశాలను రాజకీయాలకు వాడుకోవడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్న కూటమి నాయకులు, ఇప్పుడు మోదకొండమ్మ జాతర విషయంలో కూడా జోక్యం చేసుకోవడం తగదని అన్నారు. మొదట నిర్ణయించిన తేదీలను ఒక నాయకుడి వ్యక్తిగత కార్యక్రమం కారణంగా మార్చడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.ఇప్పటికైనా కూటమి నాయకులు పునరాలోచించి, ముందుగా ఖరారు చేసిన తేదీల్లోనే జాతరను నిర్వహించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో జీకే వీధి వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీపీలు బోయిన కుమారి, కోరాబు అనూష దేవి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి బూసరి కృష్ణారావు, రాష్ట్ర కార్యదర్శి జల్లి సుధాకర్, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు సాగిన గంగన్న పడాల్, మండల ఉపాధ్యక్షుడు రీమల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వంతల చంటిబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కంకిపాటి నారాయణ, విద్యార్థి విభాగం నాయకుడు పసుపులేటి సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మోదకొండమ్మ జాతరపై రాజకీయాలు తగవు
RELATED ARTICLES

