Homeతెలంగాణరైతు ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు

రైతు ముంగిట్లోకి నాణ్యమైన విత్తనాలు

 

గార్ల, పెన్ పవర్, జులై 27:

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉండేందుకు వారి ముంగిట్లోకే నాణ్యమైన విత్తనాలను అందజేస్తుందని గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళా రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు కార్యక్రమాన్ని నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మండల వ్యవసాయ అధికారి రామారావు తో కలిసి రాయితీపై రైతులకు కంది పెసర మినుముల విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వర్షాభావ పరిస్థితి లో రైతులు తక్కువ నీటి వినియోగం తో స్వల్ప కాలిక పంటలు ఆరుతడి పంటలు పప్పు దినుసులు చిరుధాన్యాలు కూరగాయలు సాగు శ్రేయస్కరం అని ఈ దిశగా ఆలోచన చేయాలని వరి మాగాణులలో నీటి కొరత వలన వరి పంటకు సరిపడా నీరు అందే అవకాశం లేకపోవడం వలన పెసర సాగు చేయడం వలన బూసారం మెరుగవడం తో పాటుగా తక్కువ రోజులలో పంట చేతికి వస్తుందని కూరగాయలు సాగు చేయడం వలన నిరంతరం ఆదాయం వస్తుందని పంటల సాగు లో వ్యవసాయ అధికారుల సాంకేతిక సలహాలు సూచనలు పాటించి సమగ్ర పోషక యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని అన్నారు. రసాయన ఎరువులు మితంగా వాడుతూ సేంద్రియ జీవన ఎరువులు ఎక్కువ గా వినియోగించి బూసారాన్ని పరిరక్షించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాజు తండా సర్పంచ్ బానోత్ సుశీల, గోపాలపురం సర్పంచ్ భూక్య భారతి, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు సాయి ప్రకాష్, పూజిత, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular