ePaper
Thursday, May 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఅర్వీనగర్ లో మహా అన్న ప్రసాదం పంపిణీ 

అర్వీనగర్ లో మహా అన్న ప్రసాదం పంపిణీ 

📰 Generate e-Paper Clip

అర్వీనగర్ లో మహా అన్న ప్రసాదం పంపిణీ

తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం అరికట్ట ఆంజనేయుల వితరణ

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 19:మండలంలోని ఆర్వీనగర్ లో మహా అన్నప్రసాదం పంపిణీ ఘనంగా జరిగింది. గ్రామంలో నూకాంబిక అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఉగాది పర్వదినం గురువారం భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు గ్రామానికి చెందిన అరికట్ట ఆంజనేయులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తన తల్లిదండ్రులు అరికట్ట వెంకటరమణ, సుశీలమ్మ జ్ఞాపకార్థం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్వి నగర్ యువత మహిళలు గ్రామ పెద్దల సహకారంతో సుమారు 2000 మందికి అన్న ప్రసాదం అందజేశారు. గ్రామంలో ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపిస్తూ భక్తులకు అన్నప్రసాదం అందజేసిన ఆరికట్ట ఆంజనేయుల కుటుంబానికి పలువురు అభినందించారు.ఈ అన్నదాన పంపిణీ కార్యక్రమాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, వార్డెన్ల సంఘం అధ్యక్షుడు పసుపులేటి వినాయక దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లె వీర వెంకట్ , బిజెపి నాయకులు రీమల పౌల్ , జీకే వీధి మండలం విలేకరుల సంఘం అధ్యక్షుడు సాయం రమణ, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular