ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడచేదువాడలో ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శేషగిరిరావుకు సన్మానం

చేదువాడలో ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శేషగిరిరావుకు సన్మానం

📰 Generate e-Paper Clip

కాజులూరు, పెన్ పవర్, మార్చి 23:
కాజులూరు మండలం చేదువాడ గ్రామంలో ఏఎంసీ డైరెక్టర్‌గా నియమితులైన రెడ్డి శేషగిరిరావును కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు.ఇటీవల జరిగిన ఏఎంసీ పాలకవర్గంలో చేదువాడ గ్రామానికి ప్రాతినిధ్యం కల్పిస్తూరెడ్డి శేషగిరిరావును డైరెక్టర్‌గా నియమించినందుకు మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు సత్యం గారికి కూటమి నాయకులు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా రెడ్డి శేషగిరిరావు మాట్లాడుతూ, మంత్రి సుభాష్ గారు మరియు సత్యం గారు తనను గుర్తించి ఏఎంసీ డైరెక్టర్‌గా నియమించినందుకుకృతజ్ఞతలుతెలిపారు. ఈబాధ్యతనునిబద్ధతతో నిర్వహిస్తూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాజులూరు మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుబ్బల నాగేంద్ర కుమార్, గ్రామ టీడీపీ అధ్యక్షులు పెంకే విష్ణుమూర్తి, గ్రామ టీడీపీ కార్యదర్శి పాలిక సుబ్రహ్మణ్యం,కాజులూరు మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి రామకృష్ణ, జనసేన నాయకులు గంజా మోహన్, వాసంశెట్టి చినబాబు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular