ePaper
Friday, May 1, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంయూటిఎఫ్‌పై నిరాధార ఆరోపణలు తగవు: యుటిఎఫ్ నాయకులు

యూటిఎఫ్‌పై నిరాధార ఆరోపణలు తగవు: యుటిఎఫ్ నాయకులు

📰 Generate e-Paper Clip

 

గంగవరం, పెన్ పవర్ ,ఏప్రిల్ 9:
ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్)పై చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నామని యూటిఎఫ్ మండల అధ్యక్షుడు బొజ్జి దొర, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు.
రంపచోడవరం లో ఏప్రిల్ 12న నిర్వహించనున్న గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల 6వ రాష్ట్ర సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గంగవరం లో జరిగింది. ఈ కార్యక్రమానికి కారం బొజ్జిదొర అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యూటిఎఫ్ స్థాపన నుంచి ఇప్పటి వరకు కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని తెలిపారు. గిరిజన, ఆదివాసీ ఉపాధ్యాయుల కోసం అన్‌ట్రైన్డ్ డీఎస్సీ సాధన, అన్‌ట్రైన్డ్ ఉపాధ్యాయులకు నోషనల్ ఇన్‌క్రిమెంట్స్ సాధనలో యూటిఎఫ్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.జి.ఓ. నెం. 3ను గౌరవ సుప్రీంకోర్టు రద్దు చేసిన సమయంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం, పీడీఎఫ్ ఎంఎల్‌సీలు స్పందించిన తొలి సంస్థ యూటిఎఫ్‌నేనని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షుడు సిహెచ్ రాంబాబు దొర, జిల్లా కౌన్సిలర్లు సిహెచ్ వెంకటేశ్వరరావు, బి. వంశీప్రియ, మహిళా కన్వీనర్లు కారం లక్ష్మి, కె. భవాని, ఎన్. దుర్గాదేవి, కోశాధికారి సత్యకిరణ్ రెడ్డి, కారం రాంబాబు, సిహెచ్ కృష్ణ, గంతా లలితదొర, కూరసం వెంకన్నదొర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular