Homeఆంధ్రప్రదేశ్పోలవరంపుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలి

పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్

గంగవరం /దేవీపట్నం/రంపచోడవరం, పెన్ పవర్, ఆగస్టు 19: పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా లెఫ్ట్ కెనాల్‌కు నీటి మళ్లింపు పనులను వేగవంతం చేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.

బుధవారం దేవీపట్నం మండలం నేలకోట వద్ద పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు సంబంధించిన నీటి మళ్లింపు కెనాల్, పైప్‌లైన్ పనులను జల విద్యుత్ శాఖ ఇంజినీర్లతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. లెఫ్ట్ కెనాల్‌కు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ల పరిస్థితిని పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. పైప్‌లైన్లకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పనుల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని, అవసరమైన చర్యల కోసం సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

కలెక్టర్ వెంట ఓఎస్డీ జావలి, తహసీల్దార్ కె. సత్యనారాయణ, జల విద్యుత్ ప్రాజెక్టు అధికారులు, కృష్ణ, డీఈ శ్రీనివాసరావు, ఇంజినీర్లు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular