ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంగంజాయి, సైబర్ నేరాలపై అవగాహన

గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన

📰 Generate e-Paper Clip

పేదలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 19:

రెడ్డి నగర్ గ్రామంలో డొంకరాయి ఎస్సై ఆధ్వర్యంలో గంజాయి వినియోగం, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నేరాల పట్ల జాగ్రత్తలు, వాటిని ఎలా నివారించాలి అనే విషయాలను వివరించారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, సహాయ కేంద్రాల వివరాలు కూడా తెలియజేశారు. కార్యక్రమం అనంతరం గ్రామంలోని పేదలకు బట్టలు, దుప్పట్లు పంపిణీ చేసి సహాయం అందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular