వంటిల్లు జంక్షన్ లో మూడు అంతస్తుల భారీ అక్రమ నిర్మాణం అనుమతులు ,నిబందనలు బేఖాతరు టౌన్ ప్లానింగ్ ,సచివాలయం సిబ్బంది నిద్రావస్థ ప్రభుత్వ ఖజానాకు భారీ లోటు విశాఖపట్నం :పెన్ పవర్ ,ఏప్రిల్ 14 జీవీఎంసీ గాజువాక జోన్ 6 పరిధి 72 వార్డులో పరిధి దినేష్ టిఫిన్ సెంటర్ ఎదురుగా1086/3926/బి /జి డబ్లుయు/ఎన్ /ఏడి /2025 నెంబర్ తో 60 అడుగులు రోడ్డు లో కమర్షియల్ మూడు అంతస్తుల భారీ అక్రమ నిర్మాణం పట్టించుకోని జివీఎంసీ అధికారులు సచివాలయం సిబ్బంది. అనుమతులు ఎవరు ఇచ్చారు , దొడ్డిదారిన అక్రమ నిర్మాణం పై పలువురు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు . పేదవాడు చిన్న గుడిసె వేస్తే వెళ్లి నేలమట్టం చేసే జీవీఎంసీ సిబ్బంది, ఇంత భారీ అక్రమం జరుగుతున్న కనీసం అటువైపు చూడను కూడా చూడలేదు అది కమర్షియల్ 3 అంతస్తులు కనీసం సెట్ బ్యాక్ లు కూడా లేకుండా మినిమం రూల్స్ పాటించకుండా ఈ ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో నుండి బయటకు రావడానికి కూడా అవకాశం లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బిల్డింగ్ లో ప్రమాదం జరిగితే పక్క బిల్డింగ్ కూడా ప్రమాదానికి గురవుతుంది. ఇటువంటి నిర్మాణానికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికైనా అక్రమ దారులపై తగిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీకి రావలసిన ఆదాయాన్ని గండి కొడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని బిల్డింగును వెంటనే నేలమట్ట చేయాలని పలువురు వాపోతున్నారు.
నిబందనలు మాకు వర్తించవు ఆక్రమార్కులు అల్టీమేటం
RELATED ARTICLES

