ePaper
Tuesday, April 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంరాజ్యాధికారమే మాస్టర్ కి : డాక్టర్ తెన్నేటి జయరాజ్

రాజ్యాధికారమే మాస్టర్ కి : డాక్టర్ తెన్నేటి జయరాజ్

బలహీన వర్గాలైన బహుజనులకు నిజమైన రక్షణ, సమాన హక్కులు, సామాజిక న్యాయం రాజ్యాధికారంతోనే సాధ్యమని డాక్టర్ తెన్నేటి జయరాజ్ స్పష్టం చేస్తూ, అంబేద్కర్ ఆలోచనలను భావితర మేధావులు లోతుగా గ్రహించి దేశ భవిష్యత్తు దిశను మార్చాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ భావజాలంపై ఆంధ్ర యూనివర్సిటీలో మెమోరియల్ లెక్చర్
బహుజన రక్షణకు రాజ్యాధికారమే మార్గమన్న డా. జయరాజ్
కాన్షీరాం ఆచరణలో అంబేద్కర్ సిద్ధాంతం
స్కిల్ డెవలప్‌మెంట్‌లో భారత్ వెనుకబాటుపై విమర్శలు
భావితర మేధావులపై దేశ భవిష్యత్తు బాధ్యత

బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్, విశాఖపట్నం , ఏప్రిల్ 14: 

బలహీన వర్గాలైన బహుజనులకు రాజ్యాధికారమే మాస్టర్ కి అని అంబేద్కర్ భావించినట్లు డాక్టర్ తెన్నేటి జయరాజు విశ్లేషించారు. మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీ, సైన్స్ కాలేజ్ లో అంబేద్కర్ చైర్ వారు నిర్వహించిన ప్రత్యేక కార్యం క్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రొఫెసర్ ఎం. జేమ్స్ స్టీఫెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ మెమోరియల్ లెక్చర్ అని ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాధికారం ద్వారానే బహుజనులకు రక్షణ కలుగుతుందని అంబేద్కర్ గారి దృఢంగా భావించినట్లు ఆయన ఉపన్యసించారు.

అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాన్సిరాం గారి ఆచరణలో చూపించారని, దాని ద్వారా బహుజనులకు రాజ్యాధికారం దక్కడంతో పాటు ఆ పాలనలో బహుజనులకు కొంత రక్షణ కూడా కలిగిందని వివరించారు. ప్రపంచ దేశాల్లో భారత దేశ స్థానం మానవతా విలువలు పాటించడంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోవడం పాలితుల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అని విమర్శించారు. తమను తాము విశ్వగురువులుగా పరిచయం చేసుకోవడం ఏవిధంగా సమంజసమని ప్రశ్నించారు. కేవలం 4.5 శాతం స్కిల్డ్ వర్కర్ కలిగిన భారతదేశం ఇతర దేశాలకు ఏమి నేర్పించగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. తప్పుడు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని చులకన చేస్తున్నారని, అవగాహన లేని నాయకులు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలో సౌత్ కొరియా 90%, జపాన్ 80%, జర్మనీ 77% స్కిల్డ్ వర్కర్స్ ని కలిగి అభివృద్ధి చెందుతుంటే కేవలం 4.5% స్కిల్ వర్కర్స్ కలిగిన భారతదేశం విశ్వగురువులమని ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగపు హక్కులను నిర్దాక్షిణ్యంగా కాలరాస్తూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని, మేధావులైన బహుజనలందరూ దీనిని గ్రహించి చక్కదిద్దాల్సి ఉందని అన్నారు.

ఈ సమావేశంలో అంబేద్కర్ ఆలోచన విధానం పై లోతైన విశ్లేషణ చేస్తూ ఆయన ఆకాంక్షను బహుజన మేధావులు గ్రహించి దేశ భవిష్యత్తును చక్కదిద్యాల్సిన బాధ్యత భావితరాల మేధావుల పైనే ఉందని ఆంధ్ర యూనివర్సిటీ స్కాలర్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రత్నం, ప్రొఫెసర్ పాల్డగ్లస్,ప్రొఫెసర్ జయరావ్, ఆంధ్ర యూనివర్సిటీ మహిళా స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular