ePaper
Monday, April 27, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడమంజేరు గ్రామంలో పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం

మంజేరు గ్రామంలో పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం

📰 Generate e-Paper Clip

అంగరంగ వైభవంగా – ధర్మకర్తల ఆధ్వర్యంలో ఘన నిర్వహణ

కాజులూరు, ఏప్రిల్ 27 ,పెన్ పవర్:
కాజులూరు మండల పరిధిలోని మంజేరు గ్రామంలో ఉన్న శ్రీ నవదుర్గ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహించే వార్షికోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
సత్యం ఫౌండేషన్ అధ్యక్షులు వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో, ఆలయ ధర్మకర్తలు మరియు ఎఎంసి వైస్ చైర్మన్ దడాల నాగార్జున – నాగేశ్వరి దంపతుల చేతుల మీదుగా ఈ దివ్య కళ్యాణం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల నడుమ పండితులు సంప్రదాయబద్ధంగా కళ్యాణ వేడుకలను నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.కళ్యాణ మహోత్సవంతో పాటు లక్ష్మీ గణపతి హోమం కూడా నిర్వహించగా, ఆలయ ప్రాంగణం అంతా భక్తి వాతావరణంతో కళకళలాడింది. ఈ వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు చుండ్రు వీర్రాజు చౌదరి, శలపాక నీటి సంఘం అధ్యక్షులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తాడి రామారెడ్డి (టిఎంఆర్), మంజేరు ఎంపీటీసీ గండి మణికంఠ శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు యర్రంనీడి గోవింద్, పుణ్యమంతుల రామకృష్ణ, పుణ్యమంతుల గంటయ్య, చందాల మల్లి బాబు, కంచుమర్తి బాబురావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.భక్తుల రద్దీతో విజయవంతంగా సాగిన ఈ మహోత్సవంలో నిర్వహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మకర్తలు దడాల నాగార్జున – నాగేశ్వరి దంపతుల సేవలను గ్రామస్థులు ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular