ePaper
Monday, April 27, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుబొంతువలస ఘాట్ రోడ్డుపై ప్రమాద స్థలాల పరిశీలన

బొంతువలస ఘాట్ రోడ్డుపై ప్రమాద స్థలాల పరిశీలన

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 27:మండలంలోని బూదరాళ్ల–బొంతువలస ఘాట్ రోడ్డుపై ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ హెచ్ అన్నాజీ రావు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, పిఆర్ -పిఐయు మండల ఇంజనీరింగ్ అధికారితో కలిసి నాలుగు ప్రమాద ప్రదేశాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.ఈ సందర్భంగా రహదారి భద్రత మెరుగుదలకు పలు చర్యలను గుర్తించారు. మలుపులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రహదారి వెడల్పును పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒక ప్రదేశంలో హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండు ప్రాంతాల్లో రహదారి ఎత్తును (గ్రేడియంట్) తగ్గించాల్సి ఉందని గుర్తించారు. మరొక ప్రాంతంలో క్రాస్ బ్యారియర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.పరిశీలన ఆధారంగా పూర్తి నివేదికను జిల్లా అధికారులకు సమర్పించనున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రహదారి భద్రతకు అవసరమైన చర్యలు త్వరలో చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular