ePaper
Saturday, April 25, 2026
ePaper
Homeఎడిటోరియల్మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు

మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపనలు

📰 Generate e-Paper Clip

రూ.16.80 లక్షల పనులకు శ్రీకారం
– వాసంశెట్టి సత్యం

రామచంద్రపురం, పెన్ పవర్,ఏప్రిల్ 25:
రామచంద్రపురం పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పట్టణంలోని 3, 4, 11 వార్డుల్లో రూ.16.80 లక్షలతో చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మున్సిపల్ కమిషనర్ కె.వి.ఆర్.ఆర్ రాజు, డిఈ శ్రీకాంత్ శనివారం శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, రామచంద్రపురం పట్టణంతో పాటు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు.పట్టణంలోని మూడో వార్డులో రూ.3.20 లక్షలతో రోడ్లు, డ్రైన్లు, నాలుగో వార్డులో రూ.5.60 లక్షలతో సిమెంట్ రోడ్డు, 11వ వార్డులో రూ.4.99 లక్షలతో సీసీ రోడ్డు, అదే వార్డులో రూ.3.01 లక్షలతో సీసీ రోడ్డు మరియు డ్రైనేజ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం రూ.16.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సురేష్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఉండవల్లి శివ, సెక్రటరీ కవల నానాజీ, క్లస్టర్ ఇంచార్జ్ కంచుమర్తి బాబురావు, మాజీ కౌన్సిలర్లు అంకం శ్రీను, అల్లం శ్రీను,కట్టా నాగేశ్వరరావు, కేతా శ్రీను సుజాత, ఏసుదాసు, వాసంశెట్టి చంద్రశేఖర్, పడాల బాబి, చల్లా బుజ్జి, విల్లా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular