ePaper
Sunday, May 31, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుమన్యం వీరుడు అల్లూరికి జీకే వీధిలో ఘన నివాళి

మన్యం వీరుడు అల్లూరికి జీకే వీధిలో ఘన నివాళి

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మే 7:స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవ వీరుడు, మన్యం ప్రజల ధీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగమణి, జీకే వీధి ఎంపీటీసీ రీమల రాజేశ్వరి, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు బత్తుల సిద్ధార్థ మార్క్, జీకే వీధి పంచాయతీ అధ్యక్షులు గడుతూరి పరమేశ్వరరావు, నరసింహారావు, తాడి రమేష్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అల్లూరి ఆశయాలు యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular