పట్టణ ఆధునీకరణలో ప్రధమ స్థానం… మాజీ చైర్మన్ రఫాని
చిలకలూరిపేట , పెన్ పవర్, మే 13 :
చిలకలూరిపేట: పట్టణం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ప్రాంతం. అయితే, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల అవసరం ఎంతో ఉందని గుర్తించిన మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ లక్ష్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ రఫాని అన్నారు. చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రధాన సమస్యలైన రోడ్లు మరియు డ్రైన్ల వ్యవస్థను ఆధునీకరించడానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కేవలం భౌతిక అభివృద్ధి మాత్రమే కాకుండా, ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ హిందూ, క్రైస్తవ మరియు ముస్లిం స్మశాన వాటికల అభివృద్ధి కోసం కూడా ఆయన కృషి చేశారు. ఇందుకోసం ఏకంగా 15 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి, చిలకలూరిపేట ప్రజల చిరకాల కోరికను నెరవేర్చారని మాజీ చైర్మన్ రపానీ అన్నారు.
ఈ అభివృద్ధి పనుల పట్ల చిలకలూరిపేట పట్టణ ప్రజలు మరియు మాజీ కౌన్సిలర్లు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పుల్లారావు నాయకత్వంలో పట్టణం పొందుతున్న ఈ మార్పును చూసి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అభివృద్ధి పనుల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూనే, మరో భారీ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. అదే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు’ చంద్రబాబు నాయుడు, మరియు లోకేష్ వంటి నేతల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పట్టణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ ‘మహానాడు’ కార్యక్రమం అఖండ విజయం సాధించాలని ఆయన కోరారు.

