చిలకలూరిపేట రూరల్ , పెన్ పవర్, మే 13 :
యడ్లపాడు: మండల తహసీల్దార్‌గా బి. అనురాధ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ బదిలీ కావడంతో, వారి స్థానంలో నియమితులైన అనురాధ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా అందుబాటులోకి తీసుకువస్తానని పేర్కొన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

