Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఎంపీటీసీ కొర్ర భీమారావుకు ఘన నివాళి అర్పించిన జనసేన నేతలు 

ఎంపీటీసీ కొర్ర భీమారావుకు ఘన నివాళి అర్పించిన జనసేన నేతలు 

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 9: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ ఎంపీటీసీ కొర్ర భీమారావు అంత్యక్రియలు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొని ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జనసేన పార్టీ నాయకులు గొర్లె వీర వెంకట్, వంతల సుబ్బారావు,గెమ్మెల సుబ్బారావు,ఎం.సతీష్ తదితరులు పాల్గొని భీమారావు ప్రజాసేవలో చేసిన కృషిని స్మరించుకున్నారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన సేవాభావం ఆదర్శనీయమని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular