గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే 9:మండలంలోని దామనాపల్లి పంచాయతీ నల్లబెల్లి గ్రామంలోని ప్రమాదకరమైన వాటర్ ఫాల్ వద్ద శనివారం పంచాయతీ క్లాప్ మిత్రాలు, సీఆర్పీ కలిసి కంచె ఏర్పాటు చేశారు.వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు, పర్యాటకులు వాటర్ ఫాల్ ప్రాంతానికి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా కర్రలతో ఫెన్సింగ్ నిర్మించారు. గత సంవత్సరం ఈ వాటర్ ఫాల్లో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.అధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సీఆర్పీ బాలరాజు, క్లాప్ మిత్రాలు పాల్గొన్నారు. ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నల్లబెల్లి ప్రమాదకర వాటర్ ఫాల్ వద్ద కంచె ఏర్పాటు
RELATED ARTICLES

