Homeఆంధ్రప్రదేశ్పోలవరంప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలి

ప్రత్యేక తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలి

📰 Generate e-Paper Clip

 

డీఈవో మల్లేశ్వరరావు

గంగవరం / దేవీపట్నం, పెన్ పవర్, మే 12:పోలవరం జిల్లాలో పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ ఆయా పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక తరగతులకు (రెమిడీయల్) తప్పనిసరిగా హాజరు కావాలని డీఈఓ వై మల్లేశ్వరావు సూచించారు. మంగళ వారం దేవీపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ పాఠశాలలో 6 మంది ఫెయిల్ కాగా, నలుగురు మాత్రమే క్లాసులకు హాజరు అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 946 మంది పదో తరగతి ఫెయిల్ అయ్యారన్నారు. ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు చేయాలని ఆయన ఆదేశించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular