ePaper
Tuesday, May 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంపోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి

పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించండి

📰 Generate e-Paper Clip

*కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిసిన రంప ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్  మిరియాల శిరీషాదేవి*

గంగవరం/ రంపచోడవరం, పెన్ పవర్, మే 12:
పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ను ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్ మిరియాల శిరీషాదేవి కోరారు. రంప చోడవరం లో కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన కార్యా లయంలో ఆమె మంగళ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పలు కీలక విషయాలు కలెక్టర్ తో చర్చించారు. నూతన విద్యా సంవత్సరంలో  విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాలు అందేలా చేయాలని కోరారు. పూర్వపు జిల్లా పేరుతో కుల ధృవీకరణ పత్రాలు ఉండటంతో మరియు అన్ని గిరిజన తెగల విద్యార్ధులు విద్యాబ్యాసం రీత్యా రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పన లో అభివృద్ధికి సహాయ చర్యలు అందించాలని కోరారు. అలాగే అడ్డతీగల మండలం డొక్కపాలెం నుండి కోవెలపాలెం వరకూ 4.5 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణం కొరకు రూ; 2.70/-లక్షలు మరియు దు చ్చర్తి కొత్తూరు నుండి బందమామిళ్ళు గ్రామం వరకు 13.10 కిలోమీటర్ల మేర రూ; 786/- లక్షలు మరియు రాజవొమ్మంగి మండలం అనంతగిరి నుండి రాజవొమ్మంగి వరకు 14 కిలోమీటర్ల మేర రూ; 840 /- లక్షలు మేరకు బీటీ రోడ్డు నిర్మాణాలకు ప్రతిపాదనలు అందించారు. గతంలో కూడా చాలా చోట్ల రహదారులు నిర్మాణాలు అసంపూర్తిగా గుత్తేదారులు వదిలేశారని సంబంధిత అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకుండా నిధులు విడుదల చేసారని ఆయా రహదారుల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఆమె వెంట కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular