రూ.8 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు
చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మే 10:
చిలకలూరిపేట : పట్ణణంలోని 22వ వార్డులో యలగాల బజార్ లో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, పట్టణ నాయకులతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.8 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డును సకాలంలో నిర్మించాలని, నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా పనులు చేయాలని ప్రత్తిపాటి గుత్తేదారుకు స్పష్టంచేశారు. రోడ్డు నిర్మాణ సమయంలో నాణ్యత పరీక్షలు జరిపి, వివరాలు తనకు తెలియచేయాలని మున్సిపల్ అధికారుల్ని ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, టీడీపీ నాయకులు మద్దిబోయిన శివ, మురకొండ మల్లిబాబు, గాలం కోటి, కూనల ప్రమీల, బేరింగ్ మౌలాలి, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

