పేసా మండల అధ్యక్షుడు కొర్ర బలరాం
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూన్ 7: పెద్ది సినిమాలో గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఈ అంశంపై చర్చించేందుకు జీకేవీధి మండల పేశా కమిటీ సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.ఉదయం 11 గంటలకు ఎంఆర్‌వో కార్యాలయం వెనుక ఉన్న కల్యాణ మండపంలో జరిగే ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు మండల పేసా కమిటీ అధ్యక్షుడు కొర్ర బలరాం తెలిపారు. మండలంలోని పేసా కమిటీ సభ్యులు, పేసా మిత్రులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు.

