Homeఎడిటోరియల్పోలవరం జిల్లాలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం

పోలవరం జిల్లాలో మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం

రంపచోడవరం, జూలై 23 (పెన్ పవర్): పోలవరం జిల్లాలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జిల్లాకు విచ్చేసిన మంత్రి లోకేష్‌కు రంపచోడవరం మండలం పోలవరం జంక్షన్ వద్ద అధికారులు, పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికారు. అధికారికంగా జిల్లా కలెక్టర్ కే. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నోక్వాల్, రంపచోడవరం ఆర్డీవో స్వాతి తదితర అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

గిరిజన సంప్రదాయ నృత్యాలు, కేరళ డప్పు వాయిద్యాలు, అభిమానుల కేరింతల మధ్య మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ కూడా అక్కడ ఉన్న ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, ప్రజలు తమ సమస్యలను వివరిస్తూ మంత్రికి అర్జీలు సమర్పించారు. వాటిని స్వీకరించిన మంత్రి సంబంధిత సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular