Homeఎడిటోరియల్ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ

గార్ల, పెన్ పవర్, జూలై 25:

గ్రామాల అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఎంపీడీవో మంగమ్మ అన్నారు. గత ఐదు రోజులుగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక లో మండలంలోని 20 గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. శిక్షణలో పాల్గొన్న వార్డు సభ్యులందరికీ శిక్షణ పత్రాలను ఎంపీడీవో మంగమ్మ అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు పేర్కొన్నారు. ప్రజలతో సమన్వయం పెంపొందించుకుని పారదర్శకంగా పని చేయాలని సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ అధికారులు అజీమ్ రవికుమార్ శ్రీకాంత్ మురళి వెంకటేష్ 20 గ్రామపంచాయతీల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular