గార్ల, పెన్ పవర్, జూలై 29:
సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హనుమంతరావు అన్నారు. ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గార్ల మండల పరిధిలోని మద్ది వంచ గ్రామంలో సీజనల్ వ్యాధులపై బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 42 మందికి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వైద్య పరీక్షలను నిర్వహించి రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఈ సందర్భంగా డాక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ వర్షాలతో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యం విషయంలో ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నీరు కాచి చల్లార్చి తాగాలని వానాకాలంలోతీసుకునే జాగ్రత్తలపై సలహాలు ఇచ్చారు సీజనల్ కాలంలో వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా డెంగ్యూ చికెన్ గునియా మలేరియా టైఫాయిడ్ జ్వరాలను నివారించేందుకు ప్రతి ఇంట్లో ప్రజలు ఫ్రైడే డ్రై డే పాటించి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో ఏఎన్ఎం దివ్యవాణి, ఆశా కార్యకర్తలు మంగతాయి, రేణుక, సాలి, లలిత, తదితరులు పాల్గొన్నారు.

