Homeతెలంగాణగార్లలో రాత్రి గస్తీ.. అక్రమాలకు చెక్‌

గార్లలో రాత్రి గస్తీ.. అక్రమాలకు చెక్‌

అక్రమ రవాణా.. దొంగతనాలపై ఉక్కుపాదం

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 20:

మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నైట్‌ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. రాత్రివేళల్లో జరిగే అక్రమ కార్యకలాపాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించేందుకు గార్ల–బయ్యారం సీఐ రవీందర్‌, గార్ల ఎస్సై సాయికుమార్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పోలీసు సిబ్బంది ద్విచక్ర వాహనాలపై విస్తృతంగా గస్తీ నిర్వహిస్తున్నారు.గంజాయి రవాణా, అక్రమ గుడుంబా విక్రయాలు, దొంగతనాలు తదితర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రధాన రహదారులు, గ్రామ శివార్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రాత్రివేళల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులు, వాహనాలను ఆపి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నైట్‌ పెట్రోలింగ్‌ కొనసాగిస్తున్నారు.పెట్రోలింగ్‌ సమయంలో పోలీసు సిబ్బంది హెల్మెట్లు ధరించి రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల భద్రతతో పాటు పోలీసుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపించినా లేదా అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 112 కు డయల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో మండలంలో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా కాపాడుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular