జగన్ విశాఖ పర్యటనకు వైసీపీ శ్రేణులు భారీగా తరలిరావాలి: జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జులై 29 : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలకాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు పిలుపునిచ్చారు.
విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం జిల్లాకు రోడ్డు మార్గంలో జగన్ పర్యటన కొనసాగనున్నట్లు తెలిపారు. విమానాశ్రయం–ఎన్ఏడీ–గోపాలపట్నం–సింహాచలం ఆర్చ్–సింహాచలం–అడివరం–శోంఠం–నీలకుండీలు–ఆనందపురం–తగరపువలస–భోగాపురం–విజయనగరం బైపాస్ మీదుగా శ్రీకాకుళం వరకు ఆయన ప్రయాణిస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల పదాధికారులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కె.కె. రాజు కోరారు. ప్రతి నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్కు ఘన స్వాగతం పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

