Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లితప్పిపోయిన బాలిక ఆచూకీ గుర్తించిన పోలీసులు

తప్పిపోయిన బాలిక ఆచూకీ గుర్తించిన పోలీసులు

సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగింత

నర్సీపట్నం, పెన్ పవర్ :

మాకవరపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్ బాలిక కేసును అనకాపల్లి జిల్లా పోలీసులు కేవలం 10 గంటల్లోనే ఛేదించి బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా గాలింపు చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, సెల్‌ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్‌లు, సీసీటీవీ-360, ఐటీ కోర్ టీం సహకారంతో అన్నవరం ప్రాంతంలో బాలికను గుర్తించి, సురక్షితంగా అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు ఛేదనలో నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, మాకవరపాలెం ఎస్సై దామోదర్ తో పాటు హెడ్ కానిస్టేబుళ్లు కృష్ణ, అప్పలరాజు, కానిస్టేబుళ్లు నవీన్ కుమార్, బి.సి. నాయుడు, కొండబాబు కీలక పాత్ర పోషించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, డీఎస్పీ పి. శ్రీనివాసరావు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular