Homeఆంధ్రప్రదేశ్పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: జీకే వీధి ఎస్సై సురేష్

పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: జీకే వీధి ఎస్సై సురేష్

గూడెంకొత్తవీధి, పెన్ పవర్, జూలై 24: పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రి ప్రత్యేక శ్రద్ధ చూపాలని గూడెంకొత్తవీధి ఎస్సై సురేష్ పిలుపునిచ్చారు. మండలంలోని కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన పేరెంట్–టీచర్ మీటింగ్ (పీటీఎం)లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థుల చదువు, ప్రవర్తన, స్నేహితుల వాతావరణంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. సెల్‌ఫోన్ వినియోగాన్ని పరిమితం చేసి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరచాలని, ఉన్నత లక్ష్యాలతో కృషి చేసి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అలాగే గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు వెంట ఉంచుకోవాలని, అధిక వేగాన్ని నివారించి సురక్షితంగా ప్రయాణించాలని, అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సురేష్ సూచించారు.కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌వో, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular