Homeతెలంగాణవరంగల్నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెడితే కఠిన చర్యలు

నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెడితే కఠిన చర్యలు

గార్ల, పెన్ పవర్, జూలై 22:

డీజే నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని గార్ల బయ్యారం సీఐ రవీందర్, ఎస్ఐ సాయి సాయికుమార్ లు హెచ్చరించారు. బుధవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలోడీజేయజమానులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూపోలీస్ అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే డీజే నిర్వహించాలని.రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజే లేదా లౌడ్ స్పీకర్లను వినియోగించరాదని, ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చిన సందర్భాలు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందన్నారు. డిజె శబ్దాలు ప్రభుత్వం నిర్ణయించిన శబ్ద పరిమితిని మించకూడదని, ఆసుపత్రులు, పాఠశాలలు, కోర్టులు నిశ్శబ్ద వాతావరణ సమీపంలో సౌండ్ ని పెంచకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా రోడ్లను ఆక్రమించకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దన్నారు. మత, కుల విద్వేషాలను రెచ్చగొట్టే అసభ్యకరమైన పాటలను ప్రసారం చేయొద్దని హెచ్చరించారు. డీజే కార్యక్రమాలు ప్రజల ఆనందం కోసం నిర్వహించినప్పటికీ, అవి ప్రజల ప్రశాంతత, ఆరోగ్యం శాంతిభద్రతలకు భంగం కలిగించకుండా చట్టాలను గౌరవిస్తూ నిర్వహించడం ప్రతి నిర్వాహకుడి బాధ్యతని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారుల చట్టబద్ధమైన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని, చట్టాలు ఉల్లంఘించినట్లయితే డీజే పరికరాలు స్వాధీనం చేసుకోవడం తో పాటుగా అనుమతి రద్దు చేయడమే కాకుండా వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఎఎస్ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, డీజే నిర్వాహకులు, యజమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular