Homeఆంధ్రప్రదేశ్ఇచ్చిన హామీలు అమలు చేయాలి - అరకు మహాగర్జనకు వాలంటీర్ల పిలుపు

ఇచ్చిన హామీలు అమలు చేయాలి – అరకు మహాగర్జనకు వాలంటీర్ల పిలుపు

భారీగా తరలిరావాలని జీకే వీధి మండల నాయకుల విజ్ఞప్తి

గూడెం కొత్తవీధి, పెన్ పవర్, జూలై 10: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలిలో ఈ నెల 14వ తేదీ (మంగళవారం) నిర్వహించనున్న వాలంటీర్ల మహాగర్జనకు జీకే వీధి మండల పరిధిలోని 16 పంచాయతీల వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరుకావాలని మండల వాలంటీర్ల నాయకులు పిలుపునిచ్చారు.శుక్రవారం జీకే వీధిలో నిర్వహించిన సమావేశంలో మండల వాలంటీర్ల అధ్యక్షుడు గెమ్మెల కోటి, ఉపాధ్యక్షుడు డి. మురళీమోహన్, కార్యదర్శి పి. భాస్కర్ రావు మాట్లాడారు.రాజీనామా చేసిన వారు, చేయని వారు అనే తేడా లేకుండా మండలంలోని అన్ని పంచాయతీల వాలంటీర్లు మహాగర్జనలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం అందజేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విధులకు దూరమైన వాలంటీర్లందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మహాగర్జన ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించనున్నట్లు తెలిపారు. అరకులో జరిగే మహాగర్జనను విజయవంతం చేసేందుకు జీకే వీధి మండలంలోని అన్ని పంచాయతీల వాలంటీర్లు భారీ సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం ప్రకటించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular