Homeతెలంగాణలాభసాటి పంటల సాగు పై దృష్టి సారించాలి

లాభసాటి పంటల సాగు పై దృష్టి సారించాలి

 

గార్ల, పెన్ పవర్, జూలై 29:

రైతులు లాభసాటి పంటల సాగుపై దృష్టి సారించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి కావటి రామారావు పేర్కొన్నారు.మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని చిన్న బంజర గ్రామంలో సర్పంచ్ మోతిలాల్ అధ్యక్షతన బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి లాభసాటి పంటలపై అవగాహన కల్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రస్తుత వాతావరణ పరిస్థితి ని అవగాహన చేసుకొంటూ వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు మేరకు పంటల పై యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు సాధించ వచ్చు నని కూరగాయలు సాగు వలన నిరంతరం ఆదాయం లభిస్తుందని పప్పు ధాన్యాల సాగు వలన బూసారం పెరుగుతుందని రైతుకు నికర ఆదాయం లభిస్తుందని సాగులో మెలకువలను పాటించాలని రసాయన ఎరువులు మితం గా వాడుతూ సేంద్రియ ఎరువులను జీవన ఎరువులను క్రమ పద్దతిలో వినియోగించాలని అన్నారు. వరి మగాణలలో నీటి లభ్యత తక్కువ గా ఉండటం వలన పెసర సాగు చేపట్టాలని పచ్చి రొట్ట సాగు చేసిన రైతులు సకాలంలో భూమిలో కలియ దున్ని సింగిల్ సూపర్ పాస్పేట్ ను వేయాలని తద్వారా రొట్ట మురిగి భూమికి బలం చేకూరుతుందని ఆఖరి దుక్కి లో జింక్ సల్ఫేట్ ను వినియోగించడం ద్వారా జింక్ లోపాన్ని నివారించడం తో పాటుగా ఇతర పోషకాలు సమర్ధవంతంగా మొక్క తీసుకొనే విధంగా తొడ్పాడుతుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం గ్రామ ఉప సర్పంచ్ వార్డ్ మెంబెర్స్ ఏ ఈ ఓ పూజిత రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular