Homeతెలంగాణహనుమకొండయువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: మంత్రి కొండ సురేఖ

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: మంత్రి కొండ సురేఖ

హన్మకొండ, పెన్ పవర్, జూలై 23:

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ హన్మకొండ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం డ్రగ్స్ నుండి విముక్తి పొందండి – బ్రైట్ ఫ్యూచర్ నిర్మించండి, మందులకు నో చెప్పండి అనే నినాదాలతో హన్మకొండ కలెక్టరేట్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు 2కే రన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు. ఈ ర్యాలీలో ఎన్‌పీడీసీఎల్ డి.కర్ణాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూ సీఎం కమిషనర్ టి.వెంకన్న, హన్మకొండ అదనపు కలెక్టర్ రవి, వరంగల్ డీసీపీ ధారా కవిత, తదితరులు హాజరై జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో కలిసి “సే నో టు డ్రగ్స్” ప్రతిజ్ఞ చేయించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సూచించారు. ఈ ర్యాలీలో నార్కోటిక్స్ డీఎస్పీ రమేష్, డిటిఓ జనార్ధన్ రెడ్డి, ఎంవీఐ కిరణ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, డిపి ఆర్ ఓ అయూబ్ అలీ, కుడా మాజీ ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో పాటు జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, ఎన్ సి సి క్యాడెట్స్, ఎస్ ఎస్, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular