Homeతెలంగాణవనపర్తిపోరాటం ఫలితంగానే బ్రిడ్జి నిర్మాణం

పోరాటం ఫలితంగానే బ్రిడ్జి నిర్మాణం

గార్ల పెన్ పవర్, జులై 23:

సిపిఐ పార్టీ పోరాటం ఫలితంగానే గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం సాధ్యమైందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నల్లమల గిరిప్రసాద్ భవనంలో గురువారం సిపిఐ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం భూక్య హరినాయక్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టె బోయిన శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గార్ల మండల ప్రజల చిరకాల స్వప్నమైన రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం సిపిఐ పార్టీ అవిశ్రాంత పోరాటం ఫలితంగా సాధ్యమైందని ప్రజల కష్టాలు చూసి అనేక ఉద్యమాలు పోరాటాలు ధర్నాలు పాదయాత్రలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు హై లెవెల్ బ్రిడ్జి పనులు మొదలయ్యాయన్నారు. సిపిఐ పార్టీ నిరుపేదల పార్టీ అని ప్రజల కోసం పోరాడి సాధించే పార్టీగా నేడు హై లెవెల్ బ్రిడ్జితో మంజూరు తో మరోసారి రుజువైందన్నారు వరదల సమయంలో పాకాల ఏరు దాటలేక విద్యార్థులు మహిళలు వ్యవసాయ కూలీలు రైతులు వైద్య సహాయం కోసం హాస్పిటల్ కు వెళ్లే వయోవృద్ధులు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారని నేడు బ్రిడ్జి నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించింది అన్నారు ప్రజల సమస్యల పరిష్కారం దిశగా సిపిఐ పార్టీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందన్నారు. ఈనెల జూలై 25 వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారని ఈ నేపథ్యంలో గార్ల మండలంలో ఆయన పర్యటించనున్నారని ఈ పర్యటన ను మండల ప్రజలు రైతులు పార్టీ శ్రేణులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి జంపాల వెంకన్న సిపిఐ పార్టీ మండల నాయకులు రాగం రమేష్ సింగు రమేష్ చాగంటి నీలమ్మ గార్ల మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వీరన్న పిచ్చయ్య జనార్ధన్ పూల్ సింగ్ భీముడు కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular