ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ, ధర్నా
నర్సీపట్నం, పెన్ పవర్ :
విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలను పెంచాలని, పీజీ విద్యార్థులకు సంబంధించిన జీవో నెం.77, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నాడు–నేడు పనులను పూర్తి చేయడం, విద్యార్థులకు బడి బస్సుల సంఖ్య పెంచడం, కేజీబీవీ, గురుకుల విద్యాసంస్థల్లో వసతి, ఆహారం, తాగునీరు, అధ్యాపకుల కొరత వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మురళీ, విశ్వ, రవి, చరణ్, సంతోష్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

