Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిABM జూనియర్ కాలేజీలో 'అభయ' అవగాహన కార్యక్రమం

ABM జూనియర్ కాలేజీలో ‘అభయ’ అవగాహన కార్యక్రమం

నర్సీపట్నం, పెన్ పవర్ :

అనకాపల్లి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న “అభయ – మీ భద్రత… మా బాధ్యత” ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఎ బి ఎమ్ జూనియర్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ షేక్ గఫూర్ పాల్గొని విద్యార్థినులు, విద్యార్థులకు మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ, అత్యవసర సహాయ సేవలు, సైబర్ నేరాల నివారణ, మహిళలు మరియు బాలికలపై జరిగే వేధింపులను అరికట్టే మార్గాలు, అలాగే సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు మరియు బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్‌లైన్ 181, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మహిళల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ మహిళల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular