Homeఎడిటోరియల్ఉద్రిక్తతల మధ్య మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

ఉద్రిక్తతల మధ్య మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం, పెన్ పవర్, జూలై 22: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును పోలీసులు బుధవారం ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేశారు. పలాసలోని జీఎంఈ కాలనీలో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసులు అప్పలరాజును అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్‌కు సంబంధించిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో అప్పలరాజును ఏ3 నిందితుడిగా పోలీసులు చేర్చినట్లు సమాచారం. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం ఆయన చేసిన ప్రయత్నాలను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో పోలీసులు అప్పలరాజును అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అప్పలరాజు అరెస్ట్ విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అప్పలరాజు అరెస్ట్ అక్రమమంటూ వారు ఆందోళనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని, కార్యకర్తలను పక్కకు తప్పించి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో జీఎంఈ కాలనీ, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular