Homeఆంధ్రప్రదేశ్ఏలూరుఆ సబ్ రిజిస్ట్రార్ రూటే సెపరేటు ..! ఎపిసోడ్ -4

ఆ సబ్ రిజిస్ట్రార్ రూటే సెపరేటు ..! ఎపిసోడ్ -4

  • అయ్యవారి బాగోతాలు -2
  • నమ్మించి వంచించిన సబ్ రిజిస్ట్రార్ ..?
  • ఆ అద్దె ఇంట్లోనే అధికారి ఓ మహిళతో సహ జీవనం
  • ఆ మహిళ ఎవరు …?
  • కమల్ హాసన్ 2.0 ఎపిసోడ్ -5 లో
  • వృద్ధుడి నమ్మకమే పెట్టుబడిగా కలప అక్రమ తరలింపు!
  • మాయమైన లక్ష విలువైన వేగేశ కలప
  • సైజుల వారీగా కారులో సర్దేసిన సబ్ రిజిస్ట్రార్!
  • ​బాధిత వృద్ధుడి నిస్సహాయత
  • 79 ఏళ్ల వయసులో న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు!
  • ​రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ సీరియస్ యాక్షన్
  • విచారణకు 2024 లోనే అధికారిక ఎండార్స్‌మెంట్!
  • భీమడోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరిన ఫైల్
  • తప్పించుకోలేని సాక్ష్యాలతో విచారణ గండం!
  • సబ్ రిజిస్ట్రార్ బెదిరింపులకు వృద్ధుడు బలి..?

చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతలో ఉన్న ప్రభుత్వ అధికారి పైనే కలప అక్రమ తరలింపు ఆరోపణలు రావడం భీమడోలులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 79 ఏళ్ల వృద్ధుడి ఫిర్యాదు, 2024లో జిల్లా రిజిస్ట్రార్ ఇచ్చిన విచారణ ఆదేశాలు, ఇప్పుడు మళ్లీ వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

ఎడిటర్ పెన్ పవర్ ఏలూరు /భీమడోలు, జూలై 19 :

ప్రజల ఆస్తులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాల్సిన రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ అధికారి పైనే అక్రమాల ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. భీమడోలు సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వాసిరెడ్డి రాఘవేంద్ర ప్రసాద్ తనకు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని అయిన 79 ఏళ్ల వృద్ధుడికి చెందిన సుమారు లక్ష రూపాయల విలువైన వేగేశ కలపను అక్రమంగా తరలించారని బాధితుడు చేసిన ఫిర్యాదు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. బాధితుడి వాదన ప్రకారం, ఇంటి ప్రాంగణంలో నిల్వ ఉంచిన ఖరీదైన వేగేశ కలపను సైజుల వారీగా వేరు చేసి కారులో తరలించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలతో పాటు తన వద్ద ఉన్న ఆధారాలను రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సమర్పించినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన జిల్లా రిజిస్ట్రార్ 2024లోనే అధికారిక ఎండార్స్‌మెంట్ జారీ చేసి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అనంతరం సంబంధిత ఫైల్ భీమడోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది. ఆరోపణలపై విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అప్పట్లోనే సూచనలు ఇచ్చినట్లు సమాచారం.

బాధితుడు తనకు న్యాయం జరగకపోవడంతో పలుమార్లు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని, వృద్ధాప్యంలో తీవ్ర మానసిక వేదనను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు కూడా వచ్చాయని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా బాధితుడు విజయ రత్నం తీవ్ర మానసిక క్షోభకు గురై అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు కుటుం

బ సభ్యులు ఆరోపిస్తున్నారని సమాచారం. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా సంబంధిత విచారణ సంస్థల నిర్ధారణ వెలువడాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు, బాధిత కుటుంబ సభ్యుల వాదనలు, అందుబాటులో ఉన్న పత్రాలు, విచారణ పురోగతిపై పెన్ పవర్ దినపత్రిక ప్రత్యేక కథనాల శ్రేణిలో తదుపరి ఎపిసోడ్‌లో మరిన్ని వివరాలు వెల్లడించనుంది. ముఖ్యంగా బాధితుడి భార్య వెల్లడించనున్న అంశాలు ఈ కేసులో కొత్త కోణాలను వెలుగులోకి తెచ్చే అవకాశముందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

కలప చోరీ కేసులో తీవ్ర మానసిక క్షోభతో ప్రాణాలు కోల్పోయిన విజయ రత్నం.? భీమడోలు సబ్ రిజిస్ట్రార్ అక్రమాలపై తదుపరి ఎపిసోడ్ 5 లో విజయ రత్నం భార్య సంచలన వివరణ.. మరిన్ని నిజాలు పెన్ పవర్ పాఠకుల కోసం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular