ఎల్బీనగర్, పెన్ పవర్, జూలై 20: తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బీఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో ఆదివారం రాత్రి బోనాల ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు, రాజకీయ నేతలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆయనను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా కలిసిమెలిసి పండుగలను జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల రవికుమార్ గుప్త, నిర్వాహకులు అఖిలేష్ గౌడ్, సుజన, కాలనీ సభ్యులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

