Homeతెలంగాణమహబూబాబాద్త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలి

త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలి

గార్ల పెన్ పవర్ జులై 20:

గ్రామ స్థాయిలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను సోమవారం ఆయన ఆకస్మికంగా
సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న స్టేషన్ రికార్డులు, కేసు దర్యాప్తు ఫైళ్లు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ నిర్వహణ, మాల్ఖానా, రిసెప్షన్, రికార్డు నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు నాణ్యతను పెంచుతూ, చట్టపరమైన విధానాలను పాటిస్తూ త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై వారి విధుల నిర్వహణ, సమస్యలు, పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.  వి పి ఓ ఎస్  లు తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారా, గ్రామాలపై పూర్తి అవగాహన ఉందా, గ్రామ పెద్దలు, యువత, ప్రజాప్రతినిధులతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లో గంజాయి రవాణా, విక్రయాలు, మత్తు పదార్థాల వినియోగంపై నిరంతరం నిఘా ఉంచాలని, అనుమానాస్పద సమాచారం లభించిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో సమాచార  ఉండాలని ఆదేశించారు.ప్రతి పోలీసు సిబ్బంది తమ విధిని కేవలం ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా, అంకితభావంతో నిర్వహించాలని, ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ సత్వర స్పందన అందించాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునికి స్నేహపూర్వక వాతావరణంలో సేవలు అందించాలని, ఫిర్యాదులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.బీట్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, రౌడీషీటర్లు, పాత నేరస్థులు, మత్తు పదార్థాల వ్యాపారుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, మహిళలు మరియు చిన్నారుల భద్రతపై గ్రామస్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ, ప్రజలకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ, ప్రతి అధికారి  సిబ్బంది అంకిత భావనతో పనిచేస్తూ జిల్లా పోలీస్ ప్రతిష్ఠను మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఎస్సై రవీందర్ గార్ల ఎస్ఐ సాయికుమార్ ఏ ఎస్ ఐ వెంకట్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular