Homeతెలంగాణగార్లలో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

గార్లలో మిన్నంటిన స్వాతంత్ర్య సంబరాలు

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 15:

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గార్ల మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పలు కార్యాలయాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ రక్షక భట నిలయంలో ఎస్సై సాయి కుమార్, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యలమరెడ్డి కృష్ణారెడ్డి, జయశంకర్ విగ్రహం వద్ద లక్ష్మణ్ నాయక్, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం ఆవరణలో సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ దుర్గాప్రసాద్, మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ దేశీ రామ్ నాయక్, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శారద, పశువైద్యశాలలో డాక్టర్ సురేష్ కుమార్, విద్యుత్ వినియోగదారుల కార్యాలయంలో మధు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తాళ్లపల్లి కృష్ణగౌడ్ సిపిఎం పార్టీ ఆఫీసులో మండల కార్యదర్శి అలవాల సత్యవతి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో ఉపసర్పంచ్ జరీనా బేగం, పంచాయతీ మధు నాయుడు, కార్యదర్శి, వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్, పూర్ణచందర్, సారయ్య, సాయి, ఇమ్రాన్, రావుజీ, భారతి, గ్రామపంచాయతీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సీపీఎం నాయకులు కందునూరి శ్రీనివాస్, అలవాల సత్యవతి, టీజీఎస్ నాయకులు గిన్నారపు మురళి, తారక రామారావు, సీపీఐ నాయకులు కట్టేబోయిన శ్రీనివాస్, జంపాల వెంకన్న, కాంగ్రెస్ నాయకులు భూక్య నాగేశ్వరరావు, కోల కుమార్ గౌడ్, శంషాద్ బేగం, రాజశేఖర్, బీఆర్ఎస్ నాయకులు రాధా, ఖదీర్ పాషా గట్టు అనంత రాములు, తెలుగుదేశం నాయకులు కత్తి సత్యం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular