Homeతెలంగాణగార్లలో మిన్నంటిన 'హర్‌ ఘర్‌ తిరంగా' సంబరాలు

గార్లలో మిన్నంటిన ‘హర్‌ ఘర్‌ తిరంగా’ సంబరాలు

 *రెపరెపలాడిన త్రివర్ణ పతాకాలు*

గార్ల పెన్ పవర్ ఆగస్టు 14:

హర్ ఘర్ తిరంగాతో ప్రతి ఇంటా దేశభక్తి చాటాలని బీజేపీ గార్ల మండల అధ్యక్షుడు నక్క శివకృష్ణ యాదవ్‌ అన్నారు.గార్ల మండల కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మన జెండా మన గర్వం మన భారతం అనే నినాదంతో మువ్వన్నెల జెండాలు చేతబూని నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత గార్ల పట్టణ పురవీధుల గుండా నెహ్రూ సెంటర్ వరకు దేశభక్తి గీతాలు, ఆలపిస్తూ భారత్‌ మాతాకీ జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ ని ఘనంగానిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా నక్క శివకృష్ణ యాదవ్‌ మాట్లాడుతూ దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేసే దిశగా దేశభక్తి జాతీయ ఐక్యతవెల్లివిరియాలనే ఉద్దేశంతో హర్‌ ఘర్‌ తిరంగా యాత్ర నిర్వహించామని ప్రజల్లో దేశభక్తి భావనను మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ కార్యదర్శి రావుక విమల్‌కుమార్‌ జైన్‌ పాల్గొని విద్యార్థులకు స్నాక్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు వార్డు సభ్యులు భారతి బిజెపి పార్టీ నాయకులు దేవా వీరస్వామి బుచ్చిబాబు రాంబాబు గణేష్ విజయ్ సతీష్ వీరియా నాయక్ వాసు అజ్మీరా రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular