గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18:
మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగు గ్రామంలో వెలసిన పురాతన హనుమాన్ దేవాలయంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు దేవాలయ ప్రధాన అర్చకులు రంగ భట్టర్ తెలిపారు. కోరిన కొంగు బంగారమై విరాజిల్లుతున్న చారిత్రాత్మక హనుమాన్ దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారని ఆయన వివరించారు. హనుమాన్ జయంతి, శ్రీరామ నవమి, ఇతర పండుగలకు భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారని వివరించారు.

