గార్ల, పెన్ పవర్, ఆగస్టు 18:
గార్ల మండల కేంద్రంలోని స్థానిక వికలాంగుల కాలనీకి చెందిన కాంపాటి కొండల్‌రావు ఇటీవల మృతి చెందగా.ఈ విషయం తెలుసుకున్న గార్ల ఆశ్రమ పాఠశాల పి ఈ టి పద్మ మానవతా దృక్పథంతో స్పందించి మృతుని కుటుంబానికి అండగా నిలిచారు.కొండల్‌రావు దశదిన కార్యక్రమాల సందర్భంగా కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. దుఃఖంలో ఉన్న కుటుంబానికి తనవంతు సహకారం అందించి కుటుంబానికి అండగా నిలిచిన పి ఈ టి పద్మ ను స్థానికులు అభినందించారు.

