Homeతెలంగాణపంజాల ఐలయ్యకు జాతీయ సమైక్యత అవార్డు

పంజాల ఐలయ్యకు జాతీయ సమైక్యత అవార్డు

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 16:

మహబూబాబాద్ జిల్లా గార్ల కు చెందిన విశ్రాంతి ఉపాధ్యాయుడు, కవి రచయిత పంజాల ఐలయ్యకు వందే భారత్ జాతీయ సమైక్యత అవార్డు-2026 లభించింది. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆనందలహరి సంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సాహిత్య రంగంలో చేస్తున్న కృషికి గాను జాతీయ సమైక్యత పురస్కారానికి ఎంపిక చేశారు. ముఖ్య అతిథులు ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ, వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కా ను వెంకటరమణ సినీ నటులు జెన్నీ , ఏసిపి నరేష్ రెడ్డి చేతుల మీదుగా జాతీయ సమైక్యత పురస్కారాన్ని అందజేశారు. ఈ సభకు వందే భారత్ మూవీ డైరెక్టర్ మల్లం రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డుతోపాటు ప్రశంస పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular